Home  »  TV News  »  Illu illalu pillalu : మేనత్తకు ధీరజ్ స్ట్రాంగ్ కౌంటర్...ఆక్సిడెంట్ నిజాన్ని బయటపెట్టేసిన శ్రీవల్లి!

Updated : Apr 11, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu ). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -442 లో..... ప్రేమ డిశ్చార్జ్ అయి ఇంటికి వస్తుంది. తన దగ్గరికి వెళ్ళాలనుకున్న సేనాపతి కుటుంబం.. ప్రేమని చూసి ఆగి పట్టుకొని ఎమోషనల్ అవుతాడు. నన్ను క్షమించు అమ్మ అని సేనాపతి అంటాడు. వాళ్లెవరో ఆక్సిడెంట్ చేస్తే నువ్వు ఎందుకు అలా అంటున్నావని ప్రేమ అనగానే సేనాపతి కంగారుపడుతూ ఆంటే నిన్ను సరిగా చూసుకోలేదు కదా అని కవర్ చేస్తాడు. భద్రవతి, రేవతి ఇద్దరు ప్రేమతో మాట్లాడుతారు. నేను బానే ఉన్నాను మీరు టెన్షన్ పడకండి అని ప్రేమ అంటుంది. పదమ్మా ఇంటికి వెళదాం నా మేనకోడలిని నేను దగ్గర ఉండి చూసుకుంటాను.. నీ కుటుంబం కంటే నిన్ను ఎవరు బాగా చేసుకోరని భద్రవతి అంటుంది.

ఆగండి నా పెళ్ళాం యొక్క పొగరుబోతు మేనత్తగారు ఏమంటున్నారు తనని మీ కంటే ఎవరు బాగా చూసుకోరు అంటున్నారా.. నా పెళ్ళాన్ని అందరి కంటే బాగా చూసుకోవడానికి నేనున్నాను.. నేను చూపించే ప్రేమ ముందు మీరు ఎవరు దరిదాపుల్లోకి కూడా రారని ధీరజ్ అంటుంటే ప్రేమ మురిసిపోతుంది. ప్రేమని తీసుకొని ధీరజ్ లోపలికి వెళ్తాడు. మరొకవైపు శ్రీవల్లి మళ్ళీ తిరిగి కాపురానికి ఎలా రావాలా అని ఆలోచిస్తుంది. నువ్వు వెళ్లి ఇప్పుడు ఇంటి పనులు అన్ని చెయ్యాలి.. ప్రేమకి హెల్ప్ చెయ్యాలి.. ఎలా అంటే నువ్వు లేకుంటే అక్కడ ఏ పని అవ్వదు అన్నట్లు మాట్లాడమని శ్రీవల్లికి భాగ్యం చెప్పి పంపిస్తుంది.

మరొకవైపు నా మేనకోడలికి ఆక్సిడెంట్ చేసింది ఎవరో తెలిసిందా అని సేనాపతిని భద్రవతి అడుగుతుంది. అది ఎవడు అయినా సరే వాడు గురించి కనుక్కోమని భద్రవతి అనగానే సేనాపతి టెన్షన్ పడుతూ సరే అక్క అని అంటాడు. మరొకవైపు ప్రేమ దగ్గరికి ధీరజ్ వచ్చి.. పదా నీకు డ్రెస్ మారుస్తానని అంటాడు. సచ్చినోడ డ్రెస్ మారుస్తానని అంటావా అని కాసేపు గొడవ పెట్టుకుంటుంది ప్రేమ కానీ ఆ తర్వాత ప్రేమకి ధీరజ్ డ్రెస్ చేంజ్ చేసి తీసుకొని వస్తాడు. భోజనం చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొపెడతాడు అప్పుడే నర్మద భోజనం తీసుకొని వచ్చి ప్రేమకి తినిపించబోతుంటే మా అయన మా వాళ్లకి ఏమని ఛాలెంజ్ చేసాడో గుర్తుందా అక్కా.. మరి నువ్వు తనని మా వాళ్ళ ముందు తక్కువ చేస్తావా అని ప్రేమ అనగానే నర్మద అర్థం చేసుకొని ధీరజ్ కి ప్లేట్ ఇస్తుంది. దాంతో ప్రేమకి ధీరజ్ భోజనం తినిపిస్తాడు. తరువాయి భాగంలో అసలు ఆక్సిడెంట్ కావాలని చేసినట్లు అనిపిస్తుందని నర్మదతో ధీరజ్, ప్రేమ అంటుంటే అప్పుడే వచ్చిన శ్రీవల్లి విని తెలిసి పోయిందా అని గట్టిగా అరుస్తుంది. దాంతో ప్రేమ వాళ్లు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.